సంబంధిత వార్తలు
- 09-05-2023 మంగళవారం రాశిఫలాలు - కనకదుర్గను ఎర్రని పూలతో ఆరాధించిన శుభం...
- 08-05-2023 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని పూజించిన మీ సంకల్పం...
- తమిళనాడులో "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శన నిలిపివేత
- 07-05-2023 ఆదివారం రాశిఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన మీ సంకల్పం....
- 06-05-2023 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన...
తెలంగాణాలో మారిపోయిన వాతావరణం.. 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలో వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటివరకు చల్లటి వాతావరణం కనిపించింది. కానీ, ఇపుడు ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఫలితంగా మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేరకు నమోదుకానున్నాయి.
మొన్నటివరకు తెలంగాణ వ్యాప్తంగా చల్లటి వాతావరణం కనిపించింది. కానీ, సోమవారం మాత్రం ఎండను, ఉక్కపోతను తట్టుకోలేని వింతైన పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమవారం నుంచి వాతావరణం మారిపోయింది. ఎండ తీవ్ర పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇపుడు 40 డిగ్రీలకు చేరుకున్నాయి.
బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.