1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. First Look: Kamal Haasan's lip-lock with Trisha

చీకటి రాజ్యం ఫస్ట్ లుక్ : కమల్ హాసన్ లిప్ లాక్ త్రిషతోనా?

First Look: Kamal Haasan's lip-lock with Trisha
కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ చీకటి రాజ్యం ( తమిళంలో తూంగావనం) సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. కమల్ హాసన్ తెలుగులో డబ్బింగ్ సినిమా కాకుండా నేరుగా చేసే ఈ సినిమా ఫస్ట్ లుక్‌పైనే ప్రస్తుతం హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. కమల్ చీకటి రాజ్యం ఫస్ట్ లుక్‌లో త్రిషతో లిప్ లాక్ అదిరిందని టాక్ వస్తోంది. తప్పకుండా ఈ మూవీ సినీ ప్రేమికులకు పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని తెలిసింది. 
 
అయితే కమల్ ఫస్ట్ లుక్‌లో ఓ ట్విస్ట్ పెట్టాడు. హీరోయిన్ ముఖం తెలియకుండానే లిప్ లాక్ కిస్ ఇస్తూ కనిపించాడు. అయితే లుక్‌లో కనిపించిన హైటూ, వెయిటూ చూస్తే అది త్రిషేనని టాక్ వస్తోంది. ఇకపోతే.. ఉత్తమ విలన్ సక్సెస్‌ఫుల్‌గా మంచి కలెక్షన్స్ కురిపిస్తున్న నేపథ్యంలో కమల్ తదుపరి ప్రాజెక్టు చీకటి రాజ్యంలో నటించేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు. ఇప్పటికే కమల్ నటించిన దృశ్యం రీమేక్ పాపనాశం రిలీజ్‌కు రెడీ అయ్యింది. 
About Writer
Selvi