గంగానది ప్రక్షాళనకు 2037 కోట్లా...? ఎటు పోతాయో చూద్దాం... తాప్సి
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2014-15లో గంగానది ప్రక్షాళనకు 2037 కోట్లు కేటాయించడంపై టాలీవుడ్ సెక్సీ నటి తాప్సీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. గంగానదిని కాపాడటానికి 2037 కోట్లు ఖర్చుపెడుతున్నారా... ఐతే ఈ నిధులు నిజంగా ఎటు పోతాయో తనకు చూడాలని ఉన్నట్లు ట్విట్టర్లో తెలిపింది.
అంతేకాదు... ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ఎలా ఉందంటూ ప్రశ్నలు కూడా వేసింది. ఇంకా ఐఐటీ, ఐఐఎంలను కేటాయించడంపై స్పందిస్తూ... ఇంజినీరింగ్, ఎంబిఏ చేసే అవకాశాలు తనకు ఇంకా మిగిలి ఉన్నాయని సంబరంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.