1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Direct

తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 'మగధీర'!

తమిళ దర్శకుడు
ప్రముఖ తమిళ దర్శకుడు ధరణి తెలుగు చిత్ర పరిశ్రమలో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన బంగారం (2006) చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేదు. దీంతో ధరణి తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను.

ఈ పరిస్థితుల్లో జూనియర్ మెగాస్టార్ రాం చరణ్ తేజ్ హీరోగా ధరణి దర్శకత్వంలో ఒక చిత్రం రూపుదిద్దుకోనుంది. మెగా సూపర్‌‌గుడ్ ఫిల్మ్ సంస్థ నిర్మించే ఈ చిత్రం పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

కాగా, ప్రస్తుతం రాం చరణ్ తేజ్ అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగబాబు నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. పూర్తిగా హాస్య, రొమాంటిక్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రానికి ఆరంజ్ అనే టైటిల్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలో తమిళంలో మాస్ పాపులర్ దర్శకునిగా పేరుగాంచిన ధరణి.. తెలుగులో మంచి హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళంలో ధరణి దర్శకత్వంలో వచ్చిన దిల్ (2001), ధూల్ (2003), గిల్లీ (2004) చిత్రాలు బ్లాక్‌బ్లస్టర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి