శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 19 మే 2018 (14:47 IST)

అలా చేసినందుకు అంజలిపై కోప్పడ్డ ప్రియుడు..?

స్లిమ్‌గా ఉంటేనే అవకాశాలు వస్తాయని నాజూగ్గా తయారైంది అంజలి. ముందు నుంచీ కాస్త బొద్దుగా.. క్యూట్‌గా కనిపించిన అంజలి ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. కానీ ఛాన్సులు మాత్రం పెద్దగా రావడం లేదు. కానీ అంజలి మాత్రం ఇంకా స్లిమ్‌గా తయారైంది. అంజలిని అలా చూసిన వార

స్లిమ్‌గా ఉంటేనే అవకాశాలు వస్తాయని నాజూగ్గా తయారైంది అంజలి. ముందు నుంచీ కాస్త బొద్దుగా.. క్యూట్‌గా కనిపించిన అంజలి ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. కానీ ఛాన్సులు మాత్రం పెద్దగా రావడం లేదు. కానీ అంజలి మాత్రం ఇంకా స్లిమ్‌గా తయారైంది. అంజలిని అలా చూసిన వారు భయపడిపోతున్నారు. సినీ పరిశ్రమలోని ముఖ్యులు అంజలి ఎందుకు ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. 
 
ఇదంతా అటుంచితే సన్నగా అవ్వడానికి తన బాయ్‌ఫ్రెండ్ జై కూడా కారణమంటూ సినీ పరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే సినిమా ఛాన్సులు వచ్చినా అంజలి నటించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. సినిమాకన్నా తన ప్రియుడే తనకు ముఖ్యమని అంజలి చెబుతోందట. 
 
అయితే జైకి అంజలి సన్నగా కావడం ఏమాత్రం ఇష్టం లేదట. మళ్ళీ తిరిగి గతంలో ఉన్న బొద్దుగుమ్మలాగా అవ్వాలని కోరుతున్నాడట జై. సన్నగా ఉంటేనే బాగుంటుందని ఒకవైపు అంజలి... వద్దు అని జై ఇలా ఒకరినొకరు వాదులాడుకుంటున్నారట. గత వారంరోజుల నుంచి వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవట. కానీ మళ్ళీ ఖచ్చితంగా వీరు కలుసుకుంటారని తమిళ సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.