శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 19 మే 2018 (13:04 IST)

'గోన గన్నారెడ్డి' మాటల రచయిత సూసైడ్ ఎటెంప్ట్ చేయడంపై ఏమ‌న్నాడో తెలుసా..?

రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్టర్ రాజసింహ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసాడ‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ఫ్యామిలీ మెంబ‌ర్స్ రాజ‌సింహ‌ను హాస్ప‌ట‌ల్‌కి తీసుకెళ్ల‌డం... డాక్ట‌ర్స్ చికిత్స చేసి ఆందోళ‌న చెందాల్సింది ఏమీ లేదు అని చెప్పిన‌ట్టు మీడియాకి తెలియ

రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్టర్ రాజసింహ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసాడ‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ఫ్యామిలీ మెంబ‌ర్స్ రాజ‌సింహ‌ను హాస్ప‌ట‌ల్‌కి తీసుకెళ్ల‌డం... డాక్ట‌ర్స్ చికిత్స చేసి ఆందోళ‌న చెందాల్సింది ఏమీ లేదు అని చెప్పిన‌ట్టు మీడియాకి తెలియ‌చేసారు. దీనిపై సోషల్ మీడియా ద్వారా రాజసింహా స్పందించారు. ఇంత‌కీ ఏమ‌న్నాడంటే... నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను. 
 
గడిచిన రాత్రి కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు రావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. నాకు డయాబెటిస్ ఉంది. ఆ సమయంలో నా పక్కన ఎవరూ లేకపోవడం వల్ల అలా జరిగింది. నా గురించి కంగారుపడ్డ వారందరికీ ధన్యవాదాలు. ఇంకో రెండుమూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని రాజసింహా తెలిపారు. 
 
ఈయన దర్శకుడిగా సందీప్ కిషన్, నిత్యామీనన్‌లతో ఒక్క అమ్మాయితప్ప సినిమాను చేశారు. అలాగే రైటర్‌గా రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాశారు.