1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bhagamati Director Ashok will be direct Saidharam Tej

మెగా హీరోతో భాగ‌మ‌తి డైరెక్ట‌ర్ మూవీ..?

Bhagamati
ఆకాశ రామ‌న్న సినిమాతో దర్శకుడిగా మారి... పిల్ల జమీందార్ సినిమాతో తొలి విజయం అందుకున్న యువ ద‌ర్శ‌కుడు జి.అశోక్. ఆ తర్వాత సుకుమారుడు, చిత్రాంగద చిత్రాలు తెర‌కెక్కించినా అవి నిరాశ పరిచాయి. అనుష్క ప్రధాన పాత్రగా అశోక్ తెర‌కెక్కించిన‌ భాగమతి చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. 2018లో టాలీవుడ్ విజయాలకు నాంది పలికింది ఈ సినిమామే అయినప్పటికీ అశోక్‌కు మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టలేదు. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఎట్టకేలకు ఆయనకు ఇప్పుడో అవకాశం వచ్చింది. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో ఆయన కలిసి పనిచేయనున్నారు. భాగమతి సినిమా వ‌లే ఈ సినిమా కూడా ఫాంటసీ డ్రామా నేపథ్యంలోనే తెరకెక్కనుందని తెలిసింది. 
 
సాయిధరమ్ ‌తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమాతో బిజీగా ఉన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే అశోక్ తో మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.
తర్వాతి కథనం
సుడిగాలి సుధీర్‌ను పెళ్లి చేసుకుంటారా..? సహజీవనం అనే ఆప్షన్ వుందిగా?