సాయిధరమ్ తేజ్ స్టార్ట్ చేసేసాడు... ఈసారైనా విజయం దక్కేనా..?
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రలహరి. ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం.. ఇలా బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో సాయిధరమ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాల తర్వాత సాయిధరమ్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నా ఈ మెగా హీరో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.
ఈ ఏడాది వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తేజ్ ఐ లవ్ యూ కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే సక్సస్ సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు. మరి.. కిషోర్ తిరుమల అయినా విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.