బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (11:08 IST)

రష్మిక మందన్నకు గట్టి పోటీ ఇవ్వనున్న భాగ్యశ్రీ బోర్సే !

Bhagyashree Borse
Bhagyashree Borse
తెలుగు సినిమాల్లో పరభాషా నటీమణులు హీరోయిన్ గా రావడం పరిపాటే. అందులో కులు నుంచి వచ్చిన భామ రష్మిక మందన్న. ఆమె చేసిన గీత గోవిందంతోపాటు పలు సినిమాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా పేరు తెచ్చుకున్న పుష్ప లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. నువ్వు అమ్మి అమ్మి అంటుంటే  సామి.. సామి... నా సామి. అనే పాటతో యూత్ లో మరింత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2లో కూడా రష్మిక నటించింది. ఆ సినిమాకు చాలా డేట్స్ కూడా ఇచ్చింది. దానివల్ల నాలుగు సినిమాలు ఒప్పుకోలేదని తెలియజేసింది కూడా.  ఆమె నేషనల్ క్రష్ గా కూడా మారింది. 
 
Bhagyashree Borse
Bhagyashree Borse
ఇప్పుడు తాజాగా ఇంచుమించు ఆమెకు మల్లే వున్న భాగ్యశ్రీ బోర్సే తెలుగులో కథానాయికగా రావడం విశేషం. మిస్టర్ బచ్చన్ సినిమాలోకి దర్శకుడు హరీష్ శంకర్ ఏరికోరి ఆమెను తీసుకువచ్చారు. ఆమెతో ఎక్స్ పోజింగ్ తరహా పాటను కూడా చేయించాడు. కాస్త బోల్డ్ గా కూడా యాక్ట్ చేసింది. నటిగా ఇది తనకు దక్కిన మంచి అవకాశమని బోర్సే ఇటీవలే తెలిపింది. రవితేజ సరసన చేసిన ఈమెను ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ, హరీశ్ శంకర్ ఆమెను తెగపొగిడేశారు. బ్యూటిఫుల్, గాడ్జియస్ అంటూ ఎటువంటి పాత్రనైనా సునాయసంగా చేసేస్తుంది. ఆమె డాన్స్ మూవ్ మెంట్ చూస్తే మీరే ఫిదా అవుతారంటూ తెగ పొగిడేశారు. ఈ సినిమా రన్నింగ్ లో వుండగానే ఆమెకు అగ్ర హీరోల సరసన నటించేందుకు నాలుగు సినిమాల్లో అవకాశాలు రావడం విశేషం. 
 
గ్లామర్ ఫీల్డ్ లో కొత్తదనం కోరుకోవడం సహజమే. అందుకే బోర్సే కు వైజయంతి మూవీస్ కూడా ఆఫర్ ఇచ్చింది. పీపుల్స్ మీడియా అయితే తమ సినిమాల్లో ఆమెనే హీరోయిన్ అని ప్రకటించేసింది. ఇంతకీ ఇంతలా ఆపర్లు రావడానికి కారణం. బోర్సే బోల్డ్ నెస్ నటనతోపాటు డాన్సర్ కూడా కావడమే.  అయితే ఎక్స్ పోజింగ్ సీన్స్ ను కూడా బోర్సే పండించగలదు. రష్మిక అలా చేస్తే ప్రేక్షకుడు చూడలేడు. కనుక రష్మికకు బోర్సే గట్టి పోటీ ఇవ్వనున్నందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.