ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (11:18 IST)

అదొక కాంప్లిమెంట్‌లా తీసుకుంటా, అది డాన్స్ నాట్ ఎక్సపోజింగ్ : భాగ్యశ్రీ బోర్సే

Bhagyashree Borse
Bhagyashree Borse
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాలని పంచుకున్నారు. 
 
-మాది ఔరంగాబాద్, మహారాష్ట్ర. మా నాన్నగారు ఉద్యోగ రిత్యా లాగోస్(నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. అక్కడే నా స్కూలింగ్ జరిగింది. బిజినెస్ మ్యానెజ్మెంట్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యువేషన్ లో ఉండగా చాలా మంది మోడలింగ్ చేయమని ప్రోత్సహించారు. ఆ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా నచ్చింది. కెమరా భయం పోయింది. కొన్ని కమర్షియల్స్ చేశాను. 
 
-మంచి అవకాశం ఎదురుచూస్తున్నప్పుడు మిస్టర్ బచ్చన్ అవకాశం వచ్చింది. హైదరాబద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ మేకర్స్ కి నచ్చింది. జిక్కీ పాత్రకు నేను పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు. తర్వాత లుక్ టెస్ట్ కోసం వచ్చినపుడు రవితేజ గారిని కలిశాను. 
 
- నేను ఏదైనా చేసినప్పుడు హండ్రెడ్ పెర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా వుంటాను. రవితేజ గారితో వర్క్ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారు ఛార్మింగ్ పర్సనాలిటీ. ఓపాటలో చేసిన డాన్స్ లో నేను ధరించిన కాస్ట్యూమ్స్ కు జేబులు కూడా పెట్టారు. అలా రవితేజ జేబేలో చేయిపెట్టి పాట పాడుతూ డాన్స్ వేయడం చాలా కొత్తగా వుంటుందని దర్శకుడు చెప్పారు. అందుకే నటిగా నేను అది ఎక్స్ పోజ్ అనుకోవడం లేదు. పాత్ర మేరకే నటించాను. 
 
-ఇందులో క్యాసెట్ రికార్డింగ్ షాప్ లో ఓ సీన్ వుంటుంది. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు.. 'ఐయాం ప్రౌడ్ అఫ్ యూ' అన్నారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.   
 
-నేను నార్త్ అమ్మాయిని. తెలుగు భాషని మొదట్లో అర్ధం చేసుకోవడం కాస్త కష్టం అనిపించింది. ప్రతి డైలాగ్ ని నా మాత్రుభాషకి ట్రాన్స్ లేట్ చేసుకొని అర్ధం చేసుకున్నాను. అయితే కొద్దిరోజుల తర్వాత భాషపై పట్టు సాధించాను. తర్వాత అంత ఈజీ అయ్యింది. తెలుగు భాష చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 
 
-రవితేజ గారు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆయన న్యూకమ్మర్ లానే వుంటారు. సెట్ లో టైంకి వుంటారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు. అందరినీ కేరింగ్ గా చూసుకుంటారు. మనం ఏ స్టేజ్ వున్నా మన క్రాఫ్ట్ కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నాను.
 
 - నన్ను చూసి చాలా మంది నేషనల్ న్యూ క్రష్ అంటున్నారు. అదొక కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. 
 
- నేను మళ్లీ రవితేజతో, విజయ్ దేవరకొండ, ఎన్.టి.ఆర్.తో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు విన్నాను. కానీ అవేవీ పూర్తిగా నిజంకాదు. ఏదైనా వుంటే ఆయా నిర్మాతలే ప్రకటిస్తారు అని కొత్త సినిమాల గురించి చెప్పారు.