శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (16:16 IST)

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి పై గుల్లెడు గుల్లెడు సాంగ్ చిత్రికరణ

Vishwak Sen, Meenakshi
Vishwak Sen, Meenakshi
హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ'తో అలరించబోతున్నారు. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి డైరెక్ట్  చేస్తున్నఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
మేకర్స్ ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు. మెకానిక్ రాకీ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సాంగ్ అనౌన్స్ మేని పోస్టర్ లో విశ్వక్, మీనాక్షి చౌదరి బ్యూటీఫుల్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ చార్ట్ బస్టర్ ఆల్బం అందించారు. సాంగ్స్ అన్నీ వైరల్ హిట్ కాబోతున్నాయి.
 
ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  
 
హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.
 
ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.
 
నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్