మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (17:25 IST)

#biggboss12 సన్నీ బాటలో శాంతి డైనమైట్.. ఎవరామె?

ఉత్తరాదిన, దక్షిణాదిన బిగ్ బాస్ షో‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను టీవీలకే కట్టిపడేస్తున్న బిగ్ బాస్ షో.. త్వరలో హిందీలోనూ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బిగ్ బాస్

ఉత్తరాదిన, దక్షిణాదిన బిగ్ బాస్ షో‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను టీవీలకే కట్టిపడేస్తున్న బిగ్ బాస్ షో.. త్వరలో హిందీలోనూ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ 12 సీజన్ కోసం బిటౌన్‌లో సర్వం సిద్ధమవుతోంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా, మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 
 
ఈ షోలో పోర్న్ కమ్ సినీతారగా ఎదిగిన సన్నీలియోన్ తర్వాత మరో పోర్న్ స్టార్ శాంతి డైనమైట్ పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఈమె భారత మూలాలు ఉన్న బ్రిటన్ పోర్న్ స్టార్. శాంతి డైనమైట్ అసలు పేరు సోఫియా వాసిలియడు. 
 
టాప్ 50 సెక్సీయస్ట్ ఉమెన్ ఆఫ్ ఏషియా జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించుకుంది. ఆమె శాంతి తల్లి పంజాబి కాగా... తండ్రి గ్రీక్ సంతతికి చెందిన వాడు. జూన్ 1, 1991లో ఉగాండాలోని కంపాలాలో శాంతి డైనమైట్ జన్మించింది. టీనేజీ వయసులోనే శాంతి డైనమైట్ గ్లామర్ మోడల్‌గా తన మీడియా కెరీర్ ప్రారంభించింది. 
 
శాంతి డైనమైట్ ఇండియాలో సొంత ప్రొడక్షన్ కంపెనీ నడుపుతోంది. అడల్ట్ మ్యూజిక్ వీడియోస్, సెక్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్, ఎయిడ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లను ప్రొడ్యూస్ చేస్తోంది.