మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (10:28 IST)

రాఖీసావంత్‌కు సారీ చెప్పిన సన్నీలియోన్.. ఎందుకంటే..?

బాలీవుడ్‌ హీరోయిన్ రాఖీసావంత్‌కు సన్నీలియోన్ అంటే ఏమాత్రం పొసగదు. పోర్న్ కమ్ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్‌పై రాఖీ తరచూ విమర్శలు గుప్పిస్తూనే వుంటుంది. అయితే తాజాగా రాజీవ్ ఖండేల్ వాలా చాట్ షో జజ్ బాత్

బాలీవుడ్‌ హీరోయిన్ రాఖీసావంత్‌కు సన్నీలియోన్ అంటే ఏమాత్రం పొసగదు. పోర్న్ కమ్ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్‌పై రాఖీ తరచూ విమర్శలు గుప్పిస్తూనే వుంటుంది. అయితే తాజాగా రాజీవ్ ఖండేల్ వాలా చాట్ షో జజ్ బాత్... సంగీన్ సే నమ్కీన్ తక్‌లో సన్నీలియోన్‌కు రాఖీ సారీ చెప్పింది. గతంలో సన్నీలియోన్ గురించి తెలుసుకోకుండా కొన్ని విమర్శలు చేశానని చెప్పింది. 
 
సన్నీలియాన్ ఇండస్ట్రీకి వచ్చి హిందీ చిత్రాలు చేయడం ప్రారంభించిన కొత్తల్లో, తాను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని, అందుకు క్షమించాలని కోరింది. సన్నీ లియోన్ గురించి.. ఆమె పడిన కష్టాలను గురించి.. ఆమె జీవితంలో పడిన కష్టాలను గురించి తనకు ఏమాత్రం తెలియదని.. ఏమీ తెలుసుకోకుండానే.. ఆమెపై విమర్శించడం తప్పేనని చెప్పింది. 
 
ఇదిలా ఉంటే.. గతంలో పోర్న్ స్టార్‌గా ఇంటర్నేషనల్ లెవల్లో ఫేమస్ అయిన సన్నీ లియోన్‌పై రాఖీ విమర్శలు చేసింది. సన్నీలియోన్ తన ఫోన్ నెంబర్‌ను అమెరికాలోని పోర్న్ ఇండస్ట్రీకి అందించిందని, దాంతో వారు తనకు కాల్స్ చేసి వేధిస్తున్నారని బాంబు పేల్చింది. పోర్న్ వీడియోల్లో నటించాలని ఆఫర్ చేస్తూ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని వాపోయిన సంగతి తెలిసిందే.