సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (14:48 IST)

మాక్సిమ్ ముఖచిత్రంలో నగ్నంగా ఫోజిచ్చిన దీపికా పదుకునే.. ఫోటో వైరల్

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే హాలీవుడ్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమాలో నటించిన దీపికా ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో చిత్రం "ట్రిపుల్ ఎక

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే హాలీవుడ్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమాలో నటించిన దీపికా ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో చిత్రం "ట్రిపుల్ ఎక్స్ 4''లోనూ నటించనుంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు డి.జె. కరుసో దీపికా పాత్రను ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హాలీవుడ్‌‍లో క్రేజును పెంచుకునేందుకు మాక్సిమ్ అనే మ్యాగజైన్‌ ముఖ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచేసింది. ఏకంగా నగ్నంగా ఫోజిచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను దీపికా పదుకునే తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది. గ్లామర్ ఎక్కువ కావడంతో నెటిజనాలు ఈ ఫోటోకు లైకులు, షేర్ల రేటును పెంచేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. అయితే ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ బాలీవుడ్ నటీమణులు మాక్సిమ్ మ్యాగజైన్ ముఖ చిత్రంలో  కనిపించేందుకు ఫోజివ్వడం కొత్తేమీ కాదని మరికొందరు వాదిస్తున్నారు. కానీ నగ్న ఫోటోలను మాక్సిమ్ ముఖ చిత్రంలో విడుదల చేసేది లేదు. కానీ దీపికా నగ్న ఫోజుతో మాక్సిమ్ నిజంగానే రిలీజ్ చేస్తుందా అనేది తెలియాల్సి వుంది.