గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (12:59 IST)

దీపికా పదుకునే- రణవీర్ సింగ్‌లు విడిపోతారా?

deepika padukone - ranveer
బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా పదుకునే- రణవీర్ సింగ్‌లు విడిపోతున్నారనే టాక్ వస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారనేదే వ్యవహారం బిటౌన్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 

ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధూ ఇటీవలే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. 
 
మరోవైపు... ఈ ఉదయం దీపిక తన తల్లితో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దీపిక చేతికి ఉండాల్సిన వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. దీంతో, ఈ జంట విడిపోతోందనే వార్త నిజమేనని పలువురు నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు.