సంబంధిత వార్తలు
- ప్రో కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలయ్య.. లుక్ అదుర్స్
- త్రిషపై మన్సూర్ అలీఖాన్ వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడు : చిరంజీవి
- చిరంజీవికి బర్త్‌డే గిఫ్టుగా ఏం ఇవ్వను.. "నా ప్రాణం తప్ప" : వైష్ణవ్ తేజ్
- 'సారా'లో సాక్షి అగర్వాల్ అందాల కవ్వింత, కిక్కెక్కిస్తానంటున్న బ్యూటీ
- త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించా.. ప్చ్... మన్సూర్ అలీ ఖాన్
బాలయ్య బాబుతో దుల్కర్ సల్మాన్.. ఎంతవరకు నిజమంటే?
నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ కెరీర్‌లో మరో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. అతని తదుపరి ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మెగా హీరోల దర్శకుడు బాబీ తొలిసారిగా బాలయ్యకు దర్శకత్వం వహిస్తున్నారు.
బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని చిత్రబృందం ఓ అప్‌డేట్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ స్ప్రెడ్ అయింది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం మొదలైంది.
అలాగే మల్టీస్టారర్ చిత్రాలకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త కూడా వైరల్ అవుతోంది. అయితే బాబీ-బాలయ్య సినిమాలో దుల్కర్ నటిస్తున్నారనే వార్తలపై అధికారిక సమాచారం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
