సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (18:33 IST)

ప్రో కబడ్డీ లీగ్‌‌ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలయ్య.. లుక్ అదుర్స్

Balakrishna
నందమూరి బాలకృష్ణ సినిమాలతోనే కాకుండా రియాల్టీ షోలతో కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో దర్శనమిస్తున్నాడు. బాలయ్య ఎప్పటికప్పుడు క్రీడా కార్యక్రమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటున్నారు. త్వరలో ప్రారంభం కానున్న స్టార్ స్పోర్ట్స్ ప్రొ కబడ్డీకి కూడా అతడు రంగంలోకి దిగనుండడం విశేషం. 
 
గతంలో రానా దగ్గుబాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అయితే ఈసారి ఆ బాధ్యతను నందమూరి బాలకృష్ణకు అప్పగించారు. బాలకృష్ణ ప్రమోషనల్ యాడ్స్‌లో కూడా నటిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ప్రత్యేక యాడ్ వీడియో కూడా విడుదలైంది. ఈ ప్రో కబడ్డీ లీగ్‌లో బాలీవుడ్ నుండి టైగర్ ష్రాఫ్, కన్నడ నుండి సుదీప్ యాడ్స్‌లో నటించగా, తెలుగు నుండి బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారు.
 
బాలకృష్ణ వీర యోధుడిగా కనిపిస్తున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి గెటప్‌లో బాలయ్య నటిస్తున్నారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అంతే కాకుండా కబడ్డీ ఆటపై తనకున్న ప్రేమను బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా చాటుకున్నారు. డిసెంబర్ 2 నుంచి కబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది.
 
మరోవైపు బాలయ్యబాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన బాబీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.