గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (14:07 IST)

రష్మికను చూస్తే నా గుండె మెలికలు తిరుగుతుందన్న బాలక్రిష్ణ

balayya-rashmika
balayya-rashmika
హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐ లవ్ యు చెప్పారు నందమూరి  బాలక్రిష్ణ. ఆమెతో డాన్స్ వేస్తూ సందడి చేశారు. ఈ అవకాశం ఆయనకు అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో దక్కింది. ఆహా..లో ప్రసారం కాబోయే యానిమల్ ప్రమోషన్ సందర్భంగా ఈ వేడుక జరిగింది. డిసెంబర్ 24 న విడుదల కాబోతున్న ఈ సినిమా టీమ్ తో బాలక్రిష్ణ మాట్లాడారు. ఈ ఎపిసోడ్ ప్రోమో నేడు విడుదల చేశారు.
 
balayy, rashmika dance
balayy, rashmika dance
యానిమల్ దర్శకుడు సందీప్ వంగాకు విస్కీ అంటే ఇస్టమట.ఆ ప్లేస్ లో నా బ్రాండ్ వాడు అంటూ బాలక్రిష్ణ సరదాగా మాట్లాడారు. రణబీర్ కపూర్ తో తన సినిమాలోని డైలాగ్ చెప్పించారు. ఇక రష్మికకు గులాబి పూవు ఇచ్చి సరదాగా ప్రపోజ్ చేశాడు. తను ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోతుంటే.. రష్మికను చూస్తే నా గుండె మెలికలు తిరుగుతుంది అని కౌంట్ వేశారు. ఇలా సరదాగా సాగిన ఈ ప్రోగ్రామ్ సన్ డే ప్రసారం కాబోతుంది.