గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (11:39 IST)

బాలయ్య "అన్‌స్టాపబుల్": వేణువును జింక ముందు ఊదు...

Balakrishna
Balakrishna
నందమూరి బాలకృష్ణ సూపర్‌హిట్ టాక్ షో "అన్‌స్టాపబుల్" కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ బరిలోకి దిగనున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. 
 
వీరి కాంబోలో వస్తున్న తాజా చిత్రం “యానిమల్” ప్రమోషన్ కోసం ఈ షోలో పాల్గొన్నారు. "రణబీర్ కపూర్‌ను వేణువును జింక ముందు వూదు కానీ.. సింహం ముందు కాదనే డైలాగ్ అదిరిపోయింది. 
 
రణబీర్ ఈ డైలాగ్ చెప్పడంతో ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయి కేకలు, ఈలలతో మారుమోగింది. రణబీర్ ఈ డైలాగ్ పలికిన తర్వాత, వారు “వసూల్ వసూల్ పైసా వసూల్” పాటను ప్లే చేశారు. ఇందుకు స్టార్ హీరోలిద్దరూ దానికి డ్యాన్స్ చేశారు
 
ఈ కార్యక్రమంలో, బాలయ్య కపూర్ల వారసత్వాన్ని ప్రశంసించడమే కాకుండా, రిషి కపూర్ గురించి గొప్పగా మాట్లాడాడు. కానీ రణబీర్ కపూర్ తన "యానిమల్" ప్రమోషన్ల కోసం సహాయం చేయాలని కోరాడు. ఇంతకుముందు, రణబీర్ కపూర్ "బ్రహ్మాస్త్ర" కోసం, రాజమౌళి జట్టుకు ఇదే విధంగా బాలయ్య ప్రమోషన్ కోసం సాయం చేశాడు.