రాజమండ్రిలో జై బాలయ్య అంటూ నినాదానాలు - ఓట్ల రాజకేయమే విడుదలకు కారణమా!
Balayya, chandrababu, Brahmani, Devansh
చంద్రబాబు విడుదలలో జై బాలయ్య అంటూ రాజమండ్రిలో మంగళ్ వారం నాడు నినాదాలు మిన్నంటాయి. ఈరోజు చంద్రబాబు విడుదల సందర్భంగా బాలయ్య కారు దిగగానే పోటెత్తిన అభిమానులు, జనాలు ఒక్కసారిగా జై బాలయ్య అంటూ నినదించారు. చంద్రబాబు జైలు బయటకు వస్తుండగా కోడలు, మనవడితో ఆప్యాయంగా పలుకరిస్తూ వున్న ఫొటోను షేర్ చేసి బాలయ్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బ్రహ్మణి, దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు గారిని రాజమండ్రిలో కలిశారు.
బాబు ఈజ్ బ్యాక్... అంటూ తెలుగుదేశం నాయకులు కూడా గట్టిగా నినదించారు. ఈ సందర్భంగా బాలయ్య చాలా ఆనందంతో కనిపించారు. యాభై రోజులపాటు చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలోనూ చంద్రబాబు పై సింపథీ నెలకొంది. ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై విలేకరుల ప్రశ్నలు సంధించారు.
ఇదంతా పక్క రాష్రం రాజకీయ విషయాలంటూ కె.టి.ఆర్., హరీష్ రావు లాంటి నాయకులు సమాధాన మిచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గత్యంతరం లేక ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ, 75 ఏళ్ళ వయస్సులో అరెస్ట్ కరెక్ట్ కాదు అంటూ మాట మార్చారు. ఆ తర్వాత ఎట్టకేలకు కె.సి.ఆర్. కూడా.. ఎన్నికల మీటింగ్ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతూ, ఆంద్రలో కుటిల రాజకీయాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని బి.జె.పి. వారు అంటున్నారని ఇన్ డైరెక్ట్గా మాట్లాడారు.
సో. ఇప్పుడు రాజకీయ ఓట్ల కోసం భయపడి చంద్రబాబును విడుదల చేశారని సర్వత్రా వినిపిస్తోంది.