మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (14:02 IST)

చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడం శుభపరిణామం : దగ్గుబాటి పురంధేశ్వరి

purandheswari
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ రావడం శభపరిణామనని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంగళవారం నెల రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన సాయంత్రానికి రాజమండ్రి జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందిస్తూ, చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తాము మొదటి నుంచి తప్పుబడుతున్నామన్నారు. నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే ఎలా అరెస్టు చేస్తారని విమర్శించారు. బాబుకు బెయిల్ రావడం మంచి పరిణామన్నారు. 
 
పమరోవైపు, వైకాపా ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. నాణ్యతలేని మద్యాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా జేబులు నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె దుయ్యబట్టారు. 
 
మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి : చంద్రబాబు లాయర్లు 
 
మద్యం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరుపనుంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఆయన ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. ఆ తర్వాత నవంబరు 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలి హైకోర్టు షరతు విధించింది. 
 
అలాగే, ఈ కేసు గురించి లేదా కేసును ప్రభావితం చేసే విధంగా నడుచుకోరాదని స్పష్టం చేసింది. అలాగే లక్ష రూపాయల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇద్దరు టీడీపీ నేతలు ష్యూరిటీ ఇవ్వడంతో చంద్రబాబు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, స్కిల్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని ఏపీ ప్రభుత్వం ముందుగానే భావించి ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు మరో కేసును సిద్ధం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమలు ఇచ్చారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను ఏ3గా చేర్చి, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 
 
ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, ప్రభుత్వం మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిందని సీఐడీ ఆరోపిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.