రామ్‌చరణ్‌కు శంకర్‌కు ఎలా సెట్ అయిందంటే!
Sankar, Chirajvee, Robo
అప్పుడెప్పుడో రజనీకాంత్ రోబోకు శంకర్ హైదరాబాద్ వచ్చాడు. ఆ వేడుకలోనే ఆ తర్వాత శంకర్‌తో నేరుగా పని చేయాలని చిరు అనుకున్నారు. చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. రోబో సమయంలోనూ జరిగింది. ఆ సినిమా వేడుకలో చిరంజీవి హాజరయి శంకర్‌తో పనిచేయాలనుందని కోరికను వ్యక్తం చేశాడు కూడా. ఈలోగా శంకర్ తమిళ సినిమాల్లో బిజీగా వుండడంతో కుదరలేదు.
మరలా రోబో 2.0 సమయంలోకూడా శంకర్ హైదరాబాద్ వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలవడం విశేషం. అప్పుడే చిరంజీవి, శంకర్ కాంబినేషన్లో సినిమా వుంటుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కట్ చేస్తే ఇన్నాళ్ళకు రామ్‌చరణ్ కాంబినేషన్ సెట్టయింది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ పనిలో వున్న రామ్‌చరణ్‌కు శంకర్ కాంబినేషన్ క్రేజ్ తెచ్చిపెట్టింది.
