చిరంజీవి 43 ఏళ్ళ కెరీర్‌కు తొలి పునాదిరాయి పడింది ఇక్కడే
Chiranjeevi, 43years, first step
11 ఫిబ్రవరి అనేది మెగాస్టార్ చిరంజీవికి మర్చిపోలేని రోజు. ఇదేరోజు 1978వ సంవత్సరంలో కెమెరా ముందు `పునాదిరాళ్లు` వేసింది ఈరోజే. అందుకే తనకు మరువరానిరోజని మెగాస్టార్ ఈరోజు ప్రకటించారు. ఇలాంటి రోజు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పేర్కొన్నాడు. ఆయన వేసిన పునాది రాయి నాటి పరిస్థితులు ఒకసారి వెబ్‌దునియా కోసం ప్రత్యేకం.
మొదటి షూటింగ్, మొదటి ప్రదేశం, షూటింగ్ అనుభవం
శివశంకర్ ప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా మారడానికి ఈరోజే పునాది రాయి పడింది. ధర్మవిజయవారి `పునాది రాళ్లు` షూటింగ్‌కు శివశంకర ప్రసాద్ రాజమండ్రి వచ్చారు. అప్పుడు అంతా శంకరబాబు అని పిలిచేవారు. తూర్పుగోదావరి జిల్లా దోసకాయపల్లిలో షూటింగ్. రాజమండ్రి నుంచి దోసకాయపల్లికి ప్రయాణం. అంతా గోదావరి దీవెన.
ఈ ఆలోచన రాగానే ఆ షూటింగ్ స్పాట్‌లో తల్లి భూదేవికి, ఎక్కడో దూరాన వున్న గోదావరి తల్లకి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు శంకర్‌బాబు. పునాదిరాళ్ళు చిత్రంలో ఐదుగురు హీరోల్లో తనూ ఒకడు. దోసకాయపల్లికి రాగానే చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌తో శివశంకర్ వరప్రసాద్ అన్న తన పేరును చిరంజీవిగా మార్చుకున్నట్లుగా చెప్పాడు.. దాంతో.. వెరీగుడ్ సింపుల్‌గాబాగుందని కితాబిచ్చారు దర్శకుడు. అప్పట్లో ఎన్నో షూటింగ్‌లు ఇక్కడ జరిగేవి. మదరాసు నుంచి ఎక్కువగా ఇక్కడికే వచ్చేవారు. రాజమండ్రిని సెంటర్‌గా చేసుకుని ఇటూ తూర్పు, ఇటు పశ్చిమ గోదావరిలోనూ షూటింగ్స్ చేసేవారు.
చిరంజీవికి చిన్నతనం నుంచి నమ్మకాలు ఎక్కవ. ఇక షూటింగ్ లో చిరంజీవి వ్యక్తిగా అందరినీ ఆకట్టుకునేవారు. రాత్రిళ్లయితే టేప్‌రికార్డ్ పెట్టుకుని డ్యాన్స్‌లు చేస్తుంటే అందరూ ఈలలు, చప్పట్లు. అవి చూసిన దర్శకుడు అంతకుముందు పాట లేకపోయినా చిరంజీవిపై పాట పెట్టేవారు. అలా వచ్చిందే `ఏ ఊరు ఏ వాడా పిల్లా నీది?` అనేది. ఈ సినిమాకు ప్రేమ్ కుమార్ కో^డైరెక్టర్. ఈయన చిరంజీవి చురుకదనం చూసి క్రాంతికుమార్‌గారు నవలా చిత్రాన్ని తీస్తున్నారని తెలిసి తనే చిరంజీవి ఫొటో పట్టుకుని చూపించాడు. చిరంజీవి ఫొటో చూడగానే వెంటనే క్రాంతికుమార్ ఓకే అనేశాడు. ఆ సినిమానే `ప్రాణం ఖరీదు`.
మొదటి రోజు షూటింగ్‌లో హడలిపోయారు చిరంజీవి. ఎందుకంటే హేమాహేమీలైన నటులు ముందున్నారు. ఎదురుగా రావుగోపాలరావు, చంద్రమోహన్, జయసుధ, సత్యనారాయణ, చలం, రమాప్రభ, మాధవి. అయితే కొత్తమ్మాయి రేష్మారాయ్ కూడా వుండడంతో చిరంజీవి కాస్త భయం తగ్గింది. సీన్ అయిన తర్వాత ఎలా నటించానంటూ వినయంగా హేమాహేమీలను అడిగేవాడు. అందరూ బాగా చేశావనగానే చిరంజీవిలో ధైర్యం నిండింది.
అలా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు సినిమాలు ఏక కాలంలో అటూ ఇటూగా షూటింగ్ జరిగింది. మామూలుగా చిన్న చిత్రాలు ఎదుర్కొనే ఇబ్బందుల కారణంగా `పునాది రాళ్ళు` విడుదల ఆలస్యం కావడంతో `ప్రాణం ఖరీదు` విడుదలకు వచ్చింది. అప్పట్లో పునాది రాళ్ళు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని టెన్షన్‌తో చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌ను తెగ విసిగించేశానని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఇప్పుడు అదే పునాదిరాయి పెద్ద వృక్షాన్ని చిత్రరంగంలో పాతింది.