శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:08 IST)

పుష్ప సెట్లో ఆచార్య ఏం చేస్తున్నాడు!

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న సినిమా `పుష్ప‌`. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది కూడా. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ కేర‌ళ‌లో జ‌ర‌గ‌నుంది. కాగా, మారేడుమ‌ల్లి నుంచి తిరిగి వ‌స్తుండ‌గా అల్లు అర్జున్ వాహ‌నం ష‌డెన్‌గా ఆగిపోయింది. ఏదో ఆక్సిడెంట్ అనుకుని బ‌య‌ట‌కు చూస్తే. అక్క‌డి గిరిజ‌నులు వాహ‌నాన్ని అడ్డ‌గించారు. అల్లు అర్జున్ బ‌య‌ట‌కి వ‌చ్చి వారితో కాసేపు ఫొటోలు దిగాక వారు వెళ్ళిపోయారు.

ఇదిలా వుండ‌గా, అక్క‌డి సెట్‌కు చిరంజీవి బ‌య‌లుదేరి వెళుతున్నారు. ఎందుకంటే అక్క‌డి వాతావ‌ర‌ణం అక్క‌డి మ‌నుషులు ఆచార్య సినిమాకు స‌రిపోతార‌ని లొకేష‌న్‌ను ద‌ర్శ‌కుడు సూచించార‌ట‌. దాంతో త్వ‌ర‌లో ఆచార్య షూటింగ్ అక్క‌డ జ‌ర‌గ‌నుంది.. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ సెట్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు చ‌ర‌ణ్‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. అందుకోసం ఆచార్య టీమ్ మారేడుమ‌ల్లిలోని పుష్ష‌ సెట్లోకి అడుగుపెట్ట‌బోతోంది. పుష్ష షూటింగ్ జ‌రిగిన ప్ర‌దేశంలోనే ఆచార్య‌ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. అదీ సంగ‌తి.