శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (20:15 IST)

కేర‌ళ షిఫ్ట్ అవుతున్న `పుష్ప‌` యూనిట్‌

Allu Arjun, Pupsha, Maaredi malli forest
అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `పుష్ప`. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం. అల్లు అర్జున్‌తో ఆర్య సినిమాలు తీసిన సుకుమార్ ఈసారి అట‌వీ నేప‌థ్యాన్ని క‌థ‌గా ఎంచుకున్నాడు. ఇప్ప‌టికే మారేడుమ‌ల్లి అడ‌వుల్లో షూటింగ్ చేస్తుండ‌గా అల్లు అర్జున్ స్టిల్‌ను కూడా విడుద‌ల చేశారు. దీనితో అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్‌గా మరి సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ తరువాత మారేడుమిల్లిలో జరిపారు. దాదాపు నెలరోజులపాటు అక్కడ షూటింగ్ జరిపి ఆ షెడ్యూల్ని పూర్తిచేసింది టీం. ఇక తదుపరి షెడ్యూల్ని కేరళలో ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకే కేరళలోనే ఈ షెడ్యూల్ జరగాల్సి ఉంది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆ షెడ్యూల్ని మారేడుమిల్లికి మార్చారు.
 
ఇప్పటికే మారేడు మిల్లిలో ఓ యాక్షన్ ఎపిసోడ్తో పాటు ఓ సాంగ్ను కూడా చిత్రీకరించినట్టు సమాచారం. ఈ సినిమా విడుదల డేట్ కూడా ప్రకటించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో భారీ బడ్జెట్తో పాటు పాన్ ఇండియా సినిమాగా తెరెకెక్కుతున్న పుష్ప కోసం థియేట‌ర్లు ఎదురుచూస్తున్నాయ‌ని చిత్ర టీమ్ న‌మ్మ‌కంగా చెబుతోంది.