గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (13:37 IST)

అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టిల్ ఫోటోగ్రాఫర్ హఠాన్మరణం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం "పుష్ప". ఈ చిత్రానికి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా జి.శ్రీనివాస్ పని చేస్తున్నారు. ఈయన గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. 
 
ఇటీవల సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం కాగా, స్టిల్స్ కోసం ఆయన కూడా వెళ్లారు. గురువారం లొకేషన్‌లో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే స్పందించిన చిత్ర యూనిట్, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన కన్నుమూశారు. 
 
ఈ ఘటనపై చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా, పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కాగా, జి శ్రీనివాస్ ఇప్పటివరకు దాదాపు 200కు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు.