సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (16:54 IST)

అల్లు అర్జున్ మారేడిమిల్లి అడ‌విలో `పుష్ప‌`రాజ్‌గా ఏం చేశాడు!

Allu Arjun, Maredimalli forest
అలావైకుఠ‌పురంలో లాంటి ఇండ‌స్ట్రి హిట్ త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రంగస్థ‌లం‌ లాంటి ఇండ‌స్ట్రిహిట్ త‌రువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌రువాత హ్యాట్రిక్ చిత్రం గా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రోడ‌క్ష‌న్ హౌస్ గా టాలీవుడ్ లో పేరుగాంచిన ‌ మైత్రీ మూవీ మేకర్స్ మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియా తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్ర‌తి అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ‌టం విశేషం. టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, షూటింగ్ అప్‌డేట్ లు కి వ‌చ్చిన క్రేజ్ వ‌రల్డ్ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మ‌న్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఈ షూట్ షెడ్యూల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు చిత్రంలో ఉన్న ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ కొసం వ‌ణికిస్తున్న చ‌లిలో అడ‌విప్రాంతం లో అల్లు అర్జున్ తో పాటు చిత్రం యూనిట్ అంతా తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కి లేచి షూటింగ్ కార్య‌క్ర‌మాల్లో బిజి అవ్వ‌టం విశేషం. ఎంత‌క‌ష్టమైనా స‌రే అభిమానుల‌కి, ప్రేక్ష‌కుల‌కి మంచి అవుట్‌పుట్ ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో పుష్ప యూనిట్ అంతా ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రం లో పుష్ప‌రాజ్ కి జోడిగా ర‌ష్మిక న‌టింస్తుంది. ర‌ష్మిక లుక్ కూడా చాలా నేచుర‌ల్ గా వుంటుంది.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన ఆడియో హైలెట్ గా నిలుస్తుంది. అల్లు అర్జున్‌, సుకుమార్, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో ఆడియో కి ఒక క్రేజ్ వుంటుంది. అలాగే మైత్రిమూవీస్‌, దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్ లో వ‌చ్చే ఆడియో కి ఓ క్రేజ్ వుంటుంది. ఇప్ప‌డు వీరందరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ పుష్ఫ ఆడియో కి క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువ‌ల్స్ అల్లు అర్జున్ అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ మ‌రియు హింది భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల అగ‌ష్టు 13న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని త‌ర‌హ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కునేలా తెర‌కెక్కిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు : 
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ 
సహ నిర్మాత - ముత్తంశెట్టి మీడియా
డైరెక్టర్: సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
స్టైలింగ్ : దీపాలి నూర్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను - మధు