శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (11:26 IST)

పుష్ప ఫోటోగ్రాఫర్ మృతి.. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా రేంజ్ సినిమా పుష్ప. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
 
ఈ మూవీకి ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జి. శ్రీనివాస్ (54) మృతి చెందారు. ఇవాళ అర్థరాత్రి రాత్రి.. అంటే దాదాపు 1 గంటల ప్రాంతంలో రాజమండ్రిలో గుండెపోటుతో మరణించారు.
 
"పుష్ప" షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లికి శ్రీనివాస్ వెళ్లాడు. అయితే.. అతనికి ఒంట్లో బాగుండకపోవడంతో అంబులెన్స్‌లో రాజమండ్రికి ఆయనను తరలించారు. కానీ శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే మరణించాడు. 
 
ఈ ఘటనతో టాలీవుడ్‌ విషాద ఛాయలోకి వెళ్లింది. శ్రీనివాస్ దాదాపు 200 లకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమర్తెలున్నారు. ఆయన మృతికి పలుగురు సిని ప్రముఖులు సంతాపం తెలిపారు.