1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Hyper Aadi at Bigg boss 4 Telugu

బిగ్ బాస్ హౌస్‌: డిటెక్టివ్ ఆది, ఏంటిది అట్టర్ ఫ్లాప్ డైలాగ్‌లు.. కానీ?

Hyper Aadi
బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ 4కి హోస్ట్‌గా సమంత నిన్న వచ్చిన విషయం తెలిసిందే. అయితే తన కోడలు హోస్ట్‌గా వస్తుందని నాగార్జున చెప్పడం.. ఆ తరువాత ఎపిసోడ్ అయిపోవడం జరిగిపోయాయి. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం కొంతమంది ప్రముఖుల ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.
 
అందులో ముఖ్యంగా డిటెక్టివ్ పాత్రలో వచ్చిన ఆది మాత్రం తనదైన శైలిలో రాణించాలనుకుని చివరకు బోర్లాపడినట్లు భావిస్తున్నారు బుల్లితెర విశ్లేషకులు. జబర్దస్త్‌లో అయితే సెటైర్లు వేసే డైలాగ్‌లు రాసుకుని ప్రిపేరయి ఆ తరువాత స్టేజ్ పైకి వస్తుంటారు.
 
కానీ ఇందులో డిటెక్టివ్‌గా తనను పిలవడంతో ఆది సంతోషంగా ఊగిపోయారట. కానీ తనదైన శైలిలో పంచ్ డైలాగ్‌లు వేద్దామని వెళ్ళి చివరకు సరైన డైలాగ్‌లు పేలక ఆది అట్టర్ ఫ్లాప్ అయినట్లు బుల్లితెర విశ్లేషకులు భావిస్తున్నారు. జనంలో కూడా ఇదే రకమైన ప్రచారం జరుగుతోందట.
 
ఆది హౌస్ లోని వారందరి గురించి బాగా తెలుసుకున్నారు. వారు ఏ విధంగా హౌస్‌లో ఉంటారో చెప్పగలిగారు. కానీ నవ్వు తెప్పించే డైలాగ్‌లు మాత్రం సరైన రీతిలో పడకపోవడం.. ఆ డైలాగ్‌లు కాస్త ఇబ్బందికరంగా అనిపించడం జరిగిపోయాయి. ముఖ్యంగా డిటెక్టివ్ ఆది పక్కనే ఉన్న సమంత మాత్రం ఆది కొన్ని డైలాగ్‌లకు ఫీలయినట్లు షోలో స్పష్టంగా కనిపించిందట. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె నవ్వుతూనే కనిపించిందంటున్నారు బుల్లితెర విశ్లేషకులు. 
About Writer
జె
తర్వాతి కథనం
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్