గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 అక్టోబరు 2020 (16:40 IST)

తల నిండా మల్లెపూలు పెట్టుకుని ఎదురుచూస్తున్న రాశీఖన్నా...

రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఒక్కసారిగా వెండితెరపై వెలిగిన హీరోయిన్.  ఆ తర్వాత వరుస టాలీవుడ్ ఆఫర్లతో తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నదీ బ్యూటీ. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరిలా ఇంట్లో కూర్చోకుండా వరసగా ఫోటో షూట్లు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటోంది.
ఇటీవల ఆమె చీర కట్టుతో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోమారు చీరకట్టుతో, తల నిండా మల్లెపూలు పెట్టుకుని గోడకు ఆనుకుని నిలుచుని ఎదురుచూస్తున్నట్లు, బొట్టు పెట్టుకుంటూ దిగిన ఫోటోలను షేర్ చేసింది. వాటితో పాటు ఇలా కామెంట్ కూడా పెట్టింది అందాల రాశీఖన్నా.