గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (19:28 IST)

పెళ్ళి ఎప్పుడో చెప్పేసిన రాశీ ఖన్నా (video)

సినిమా ప్రారంభంలో లావుగా కనిపించిన రాశీ ఖన్నా ఆ తరువాత అవకాశాల కోసం జీరో సైజ్ లోకి వెళ్ళిపోయారు. చేసిన సినిమాలు తక్కువే అయినా సరే రాశీ ఖన్నాకు మాత్రం అభిమానులు ఎక్కువమందే ఉన్నారు. 
 
కరోనా సమయంలో డైటింగ్ చేస్తూ లావు అవ్వకుండా జాగ్రత్త పడిన రాశీ కన్నా మళ్ళీ షూటింగ్ లోకి వెళ్ళడానికి సిద్థమవుతున్నారు. అయితే ఈ గ్యాప్‌లో రాశీ ఖన్నా అభిమానులతో తన మనస్సులోని మాటలను పంచుకున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాపిస్తోంది. మావాళ్ళు నాకు పెళ్ళి చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడే వద్దని చెప్పినా వినిపించకోవడం లేదు. ఈ యేడాది చివరికల్లా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నా. మా కుటుంబ సభ్యులు చూసిన వరుడినే పెళ్లి చేసుకుంటానని రాశీ ఖన్నా స్పష్టం చేశారు. ప్రేమ వివాహం తనకు ఇష్టం లేదంటోంది రాశీ ఖన్నా.