శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (19:59 IST)

పెళ్లిపై సీరియస్‌గా ఆలోచన చేస్తున్న 'చందమామ' (video)

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు ఇటీవలే 35 యేటలోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ చేతినిండా మూవీ అవకాశాలు ఉన్నాయి. 
 
ఈ క్రమంలో తన చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని తల్లిగా మారినప్పటికీ కాజల్ మాత్రం కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది. తాజాగా 35వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన కాజల్ పెళ్లి గురించి సీరియస్‌గా ఆలోచిస్తోందట. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని భావిస్తోందట. 
 
ఔరంగాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవడానికి కాజల్ ఒప్పుకున్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత కూడా రెండు మూడేళ్లు సినిమాలు చేయాలని అనుకుంటోందట. తన పెళ్లి గురించి త్వరలోనే కాజల్ ప్రకటన చేయబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై కాజల్ క్లారిటీ ఇవ్వాల్సివుంది.