గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (12:01 IST)

తిరుమలలో ప్రత్యక్షమైన 'దిల్' రాజు దంపతులు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొత్త జంట 'దిల్' రాజు దంపతులు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరూ శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఇటీవల వైఘా అనే మహిళను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. 
 
ఈ పెళ్లి లాక్డౌన్ ఆంక్షల కారణంగా అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు తిరుమలకు చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
కాగా, దిల్ రాజు మొదటి భార్య అనిత గత 2017లో అనోరాగ్యం కారణంగా చనిపోయిన విషయం తెల్సిందే. ఈ దంపతులకు హర్షిత అనే కుమార్తె ఉంది. ఈమె ఎంపిక చేసిన వైఘాను దిల్ రాజు రెండో భార్యగా స్వీకరించారు. ఈమె గతంలో ఎయిర్‌హోస్ట్‌గా పని చేశారు.