మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? వీళ్లేమీ సంసారం చేస్తారో?
తెలంగాణలో ఇరవై మందితో పెళ్ళితంతు పూర్తి చేసుకోవచ్చునని కేసీఆర్ సర్కారు తెలిపింది. ఈ నేపథ్యంలో నటి బీజేపీ నాయకురాలు మాధవీ లత లాక్ డౌన్‌లో జరుగుతున్న పెళ్లిళ్లపై కామెంట్లు చేసింది. యంగ్ హీరో నిఖిల్ - పల్లవి వర్మల పెళ్లి కొద్దిమంది అతిథుల మధ్య నిరాడంబరంగా జరిగింది. లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లిళ్లపై మాధవీ లత పరోక్షంగా సెటైర్లు విసిరింది. ''అసలు జనాలు ఆగట్లేదుగా.. మాస్కులు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం.. అదీ పోతే మాఘమాసం.. లేకుండా మరో సంవత్సరం తరువాత ముహూర్తం వస్తుంది కదా.. ఏ పెళ్లి పిల్ల దొరకదా.. లేకుండా పిల్లోడు మారిపోతాడా?? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? అంటూ కామెంట్స్ చేసింది.
కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా.. ఫిక్స్ అయిన మ్యారేజ్‌లో గ్యాప్ వస్తే.. నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా.. అంటూ మాధవీలత చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ''నా పోస్ట్ నా ఇష్టం.. నా ఒపీనియన్ నేను చెప్తా.. నాకు ఆ హక్కు ఉంది'' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.