శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (17:00 IST)

జాన్వీ కపూర్‌పై కన్నేసిన 'వకీల్ సాబ్' నిర్మాత?! (video)

సినీ పంపిణీదారుడు నుంచి సినీ నిర్మాతగా మారిన 'దిల్' రాజు.. ప్రస్తుతం తెలుగులోని అగ్ర నిర్మాతల్లో ఒకరు. ఈయన బ్యానర్‌లో నటించేందుకు ప్రతి ఒక్కరూ పోటీపడుతుంటారు. పైగా, దిల్ రాజు నిర్మించే చిత్రాలన్నీ సూపర్ హిట్టే. అలాంటి దిల్ రాజు ఇపుడు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌పై దృష్టిసారించారు. ఈమెను తెలుగు వెండితెరకు పరిచయం చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్నారు. 
 
అన్నీ అనుకున్నట్టు కుదిరితే జాన్వీని "వకీల్ సాబ్" మూవీ నిర్మాత అయిన దిల్ రాజు తెలుగు వెండితెరకు పరిచయం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే అంశంపై జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో దిల్ రాజు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 
 
వీరిద్దరి మధ్య జరిగే చర్చలు ఫలప్రదమైతే, వీరిద్దరూ ఓ ఒప్పందానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అంటే వకీల్ సాబ్ మూవీ ఆడియో లాంచ్ సమయంలో జాన్వీ కపూర్ తెలుగు వెండితెర ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.