శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (10:44 IST)

కుర్రకారుకు మతులు పోగొడుతున్న జాన్వీ కపూర్ వర్కౌట్స్!

వెండితెర అతిలోక సందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. 'దఢక్' చిత్రం త్వారా బాలీవుడ్ వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే, ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా తన ఇంటికే పరిమితమైంది. ఈ సమయంలో తన అందానికి మరింత మెరుగులు దిద్దుకునే పనుల్లో నిమగ్నమైంది. ఇందులోభాగంగా ఈ అమ్మడు అదిరిపోయే వర్కౌట్స్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. 
 
తాజాగా ఈ అమ్మడు జిమ్‌లో చేస్తున్న వర్కౌట్స్ చూస్తే కుర్రకారు సొంగ కార్చుకోవాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ప్రస్తుతం ఈ జూనియర్ శ్రీదేవి రెండు ప్రాజెక్టులకు కమిట్ అయివుంది. అందులో ఒకటే కార్తీక్ ఆర్యన్ నటించే దోస్తానా2 కాగా, రెండోది గుంజన్ సక్సేనా నిర్మించే ది కార్గిల్ గర్ల్ అండ్ రోహి అఫ్జానా మూవీ.