సంబంధిత వార్తలు
- మల్లెపూల తోటలో 9 యేళ్ల బాలికపై 14 యేళ్ళ బాలుడు అత్యాచారం!
- తమిళనాడులో 817 కేసులు.. గుజరాత్లో విలయతాండవం
- జ్యోతిష్యుడి మాట విని నిండు గర్భిణిని కాలితో తన్ని.. అబార్షన్ చేశాడు..
- జూలై నాటికి 10 లక్షల పాజిటివ్ కేసులు ... 4 రాష్ట్రాల్లో సామూహిక వ్యాప్తి? (video)
- కేరళలో 67 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 7వేల కేసులు
అది నేర్చుకోవడంలో నేను నిత్యవిద్యార్థినే అంటున్న రాశీ ఖన్నా
రాశీఖన్నా విద్యార్థి అవతారమెత్తడమేంటి.. సినిమాలో విద్యార్థిగా నటిస్తోంది.. ఇప్పుడు షూటింగ్‌లు లేవు కదా. రాశీ ఖన్నా ఉన్నట్లుండి విద్యార్థినిగా మారిపోవడం ఏంటని అందరూ అనుకుంటున్నారు కదా. అదేమీ లేదండి.. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేని రాశీ ఖన్నా తమిళం నేర్చుకుంటోందట.
తెలుగులో కాదు తమిళంలోను రాశీకి మంచి ఆఫర్లే వస్తున్నాయట. దీంతో రాశీ ఖన్నా తమిళం నేర్చుకోవాలని లాక్ డౌన్ ముందే అనుకున్నదట. షూటింగ్ చేస్తూనే తమిళం నేర్చుకోవడానికి గంట సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట. అయితే ఉన్నట్లుండి లాక్ డౌన్ రావడం.. షూటింగ్‌లు ఆగిపోవడం జరిగిపోయాయి.
ఇది కాస్త రాశీ ఖన్నాకు బాగా కలిసొచ్చింది. అందుకే రాశీ ఖన్నా తమిళంలో తన గురువు మిస్ లీలతో ఆన్ లైన్లో క్లాస్‌లు నేర్చుకుంటోందట. తాను విద్యార్థిని అయిపోయానంటూ ల్యాప్ టాప్ చేతిలో పట్టుకుని ఒక ఫోటోకు ఫోజిచ్చి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది అమ్మడు. ఆ ఫోటోకు కాస్త అభిమానులు తెగ సందేశాలను పంపించేస్తున్నారట.
చిన్నప్పుడు ఎప్పుడో స్కూలుకు వెళ్ళి చదువుకున్నాను. మళ్ళీ ఇప్పుడు విద్యార్థినిగా మారిపోయి చదువుకుంటున్నాను. నేను నిత్యవిద్యార్థిని అంటూ పోస్ట్ చేసిందట రాశీ ఖన్నా.
