మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (19:59 IST)

తమిళనాడులో 817 కేసులు.. గుజరాత్‌లో విలయతాండవం

తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తాజాగా 817 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే బుధవారం ఆరు మంది మృతి చెందారు. ఇంకా 567 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,545గా ఉంది, ఇందులో 133 మరణాలతో పాటు 9,909 మంది డిశ్చార్జ్ అయ్యారని తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 
 
ఇక భారత దేశంలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం 4,337గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 64,425 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 83,004 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 6,387 కొత్త కేసుల తర్వాత భారతదేశం ఇప్పుడు 1.51 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది.
 
మరోవైపు, గుజరాత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7139 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 915 మంది ప్రాణాలు కోల్పోయారు.