శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (11:40 IST)

జ్యోతిష్యుడి మాట విని నిండు గర్భిణిని కాలితో తన్ని.. అబార్షన్ చేశాడు..

జ్యోతిష్యుడి మాట విని ఓ మూర్ఖుడు దారుణానికి ఒడిగట్టాడు. రెండో బిడ్డ పుడితే తన ప్రాణానికి ప్రమాదమని జ్యోతిష్యుడు చెప్పాడని.. నిండు గర్భిణి అయిన భార్య కడుపు మీద కాలితో తన్ని గర్భ స్రావం చేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, ఈరోడ్‌ జిల్లా అమ్మపేట సమీపం ములియనూరికి చెందిన మునుస్వామి (32) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
 
ఇతని భార్య రమ్య (25) వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగగా, ఇప్పటికే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఇతని భార్య గర్భం దాల్చింది. కాగా ఈ విషయంలో జ్యోతిష్కున్ని సంప్రదించిన మునుస్వామికి, రెండవ బిడ్డ పుడితే తన ప్రాణాలకు ప్రమాదం అని అతను చెప్పాడట. దీంతో భయాందోళనకు గురైన మునిస్వామి భార్య రమ్యను అబార్షన్‌ చేసుకోమని కోరగా, ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఫుల్‌గా మద్యం తాగివచ్చిన మునిస్వామి మరోసారి భార్యను కొట్టడమే కాకుండా, ఆమె కడుపుపై బలంగా తన్నడంతో తీవ్రమైన నొప్పికు గురవ్వగా స్థానికులు రమ్యని కాపాడి ఆమె పుట్టింటికి పంపించారు. 
 
ఆయితే రెండురోజుల తర్వాత మళ్ళీ ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఈరోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు రమ్యకి అబార్షన్‌ అయినట్లు తెలుపగా, ఆ మహిళ అమ్మాపేట పోలీస్‌ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మునిస్వామి కోసం గాలిస్తున్నారు.