శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (20:19 IST)

కేరళలో 67 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 7వేల కేసులు

కరోనా మహమ్మారి కేరళలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి.. కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 963కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 415.542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కేరళలో ఏప్రిల్ నుంచి మే తొలి వారం వరకూ కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. 
 
67 విదేశాల నుంచి కేరళకు వచ్చిన 27 మందికి, మహారాష్ట్ర-15, తమిళనాడు-9, గుజరాత్-5, పుదుచ్చేరి-1, ఢిల్లీ-1, కర్ణాటక నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు. మరో 7 మంది ఇతరుల నుంచి వైరస్ వ్యాప్తి చెందడం వల్ల కరోనా బారిన పడినట్లు తెలిపారు. 
 
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ మినహాయింపు తరువాత ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 7,000కు చేరువవడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,000 దాటింది. మరోవైపు దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ సామర్ధ్యం పెరిగిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. రోజుకు 1.1 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించింది.