శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (19:43 IST)

హాట్ స్పాట్‌గా మారిన హైదరాబాద్.. మటన్ వ్యాపారికి కరోనా..

తెలంగాణలో కరోనా వైరస్‌కు హాట్ స్పాట్‌గా హైదరాబాద్ మారింది. మటన్ వ్యాపారికి జియాగూడలోని బంధువుల ద్వారా సోకినట్టుగా తెలుస్తోంది. కాగా, జియాగూడ ఏరియాలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. 
 
తాజాగా పహడీషరీఫ్‌లో ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టుగా చెబుతున్నారు. పహాడీషరీఫ్‌లో నివాసం ఉండే ఓ మటన్ వ్యాపారి ఇంట్లోని 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెబుతున్నారు.. దీంతో.. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా మార్చేశారు అధికారులు.
 
వివరాల్లోకి వెళితే.. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన ఇందిరానగర్, వెంకటేశ్వర్‌నగర్, దుర్గానగర్, సాయిదుర్గానగర్, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, ఇక్బాల్‌గంజ్, సంజయ్‌నగర్‌ బస్తీల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరించింది. 
 
ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు జియాగూడ నలుమూలలా కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. దీంతో గత పది రోజులుగా జియాగూడ పరిసర ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందంటున్నారు.