సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (14:49 IST)

చంద్రబోస్‌పై అద్భుత ట్యూన్ కట్టిన డీఎస్పీ.. 'ఎంత సక్కగ రాశారో' అంటూ..

తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన సినీగేయ ఆణిముత్యం చంద్రబోస్. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 యేళ్లు. ఈ సిల్వర్ జూబ్లీ కాలంలో ఎన్నో అద్భుతమైన పాటలు చంద్రబోస్ కలం నుంచి జాలువారాయి. అలాంటి చంద్రబోస్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ కట్టారు. ఎంత సక్కగ రాశారో నంటూ సాగే ఈ పాట రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే అంటూ సాగే బాణీలో సాగుతోంది. 
 
రామ్ చరణ్ - సమంతలు నటించిన రంగస్థలం చిత్రంలో కూడా ఈ పాటను చంద్రబోస్ రాసిన విషయం తెల్సిందే. ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై 'ఎంత సక్కగ రాశారో' అంటూ దేవిశ్రీ పాట పాడారు. ఈ పాట అభిమానులను అలరిస్తోంది. 
 
కాగా, 1995లో వచ్చిన "తాజ్ మహల్'' సినిమాకు తొలిసారి సాహిత్యం అందించిన చంద్రబోస్ అప్పటి నుంచి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక అద్భుత పాటలను రాశారు. చంద్రబోస్‌పై డీఎస్పీ ట్యూన్ కట్టి పాడిన పాటను మీరూ ఓసారి వినండి.