శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (10:49 IST)

మల్లెపూల తోటలో 9 యేళ్ల బాలికపై 14 యేళ్ళ బాలుడు అత్యాచారం!

అభంశుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి 14 యేళ్ల బాలుడు లైంగిదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని మణప్పారై పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ సముద్రం ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి జిల్లా కృష్ణసముద్రం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఇదే పాఠశాలలో 14 యేళ్ళ బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. 
 
ఈ బాలుడు ఆ చిన్నారిపై కన్నేశాడు. ఈ క్రమంలో చిన్నారికి మాయమాటలు చెప్పి గ్రామానికి సమీపంలో ఉన్న మల్లెపూల తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసేందుకు యువకుడు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ చిన్నారి పెద్దగా కేకలు వేయడంతో భయపడిన ఆ బాలుడు... ఈ వ్యవహారం బయటకు తెలియకుండా ఉండేందుకు వీలుగా పెద్ద బండరాయితో చిన్నారి తలపై కొట్టాడు. దీంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. 
 
ఆ తర్వాత గ్రామంలోకి ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోయి చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని స్థానికులకు చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, బాలుడిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో ప్రశ్నించారు. 
 
అయినప్పటికీ ఆ బాలుడు తనకేమీ తెలియదన్నట్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయి.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. చిన్నారిని హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోంకు తరలించారు.