సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (11:52 IST)

ఐసీయూ పేషెంట్‌పై వార్డు బాయ్‌ల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఛండీఘడ్ బిలాస్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళలు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స కోసం అడ్మిట్ కావాలన్నా జడుసుకునేలా ఓ ఘోరం జరిగింది. ఓ టీనేజీ బాలిక ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. వార్డు బాయ్‌లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిలాస్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
18 ఏళ్ల యువతి మే 18వ తేదీన మందులు తీసుకోవడం ద్వారా అలెర్జీకావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె మాట్లాడలేని స్థితిలో ఐసీయూలో అడ్మిట్ చేసింది. అయితే తనపై జరిగిన ఘటన గురించి పేపరులో రాసి మరీ తల్లిదండ్రులకు చెప్పింది. 
 
తాను సామూహిక అత్యాచారానికి గురయ్యానని.. ఇందుకు వార్డు బాయ్స్ కారణమని చెప్పింది. ఈ వ్యవహారం మీడియా పుణ్యంతో లేటుగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
బాధితురాలి తండ్రి బిలాస్‌పూర్‌లోని సివిల్ లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అపోలోకు తరలించారు.