సంబంధిత వార్తలు
- రూ.98 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో.. కస్టమర్లకు షాక్
- బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ల సవరణ.. రూ.97లకు పైబడిన ప్లాన్లకు కొత్త లాభాలు
- బీఎస్ఎన్ఎల్ రూటు మార్చింది.. క్యాష్ బ్యాక్ కూడా..?
- జియో గుడ్ న్యూస్.. లాక్ డౌన్.. ఇన్కమింగ్ కాల్స్‌కు నో బంద్
- దేశంలో లాక్డౌన్ : కాలపరిమితిని పొడగించిన టెల్కో కంపెనీలు
బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్.. నో డేటా.. 600 రోజులకు..?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ మొత్తంలో డేటాను వాడుతూ అధికంగా ఫోన్ కాల్స్ చేసే వినియోగదారుల కోసం ఏకంగా 600 రోజుల చెల్లుబాటు కాలంతో కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్లు ఈ కొత్త ప్లాన్ డేటాను వాడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ప్లాన్ ధర రూ.2,399. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇది రీఛార్జ్ చేసిన రోజు నుండి 600 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. టెలికామ్ మార్కెట్లో ఇతర ప్లాన్లు ఏవీ ఈ రకమైన యాక్సిస్‌తో ఇన్ని రోజుల వ్యాలిడిటీ లేకపోవడం బీఎస్ఎన్ఎల్‌కి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. కానీ ఈ ప్లాన్‌లో డేటా వాడుకోవడానికి అవకాశం లేదు.
ఈ ప్లాన్ మీకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, 60 రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కానీ డేటా ప్రయోజనం మాత్రం ఏదీ లేదు.
తర్వాతి కథనం
