జియో గుడ్ న్యూస్.. లాక్ డౌన్.. ఇన్‌కమింగ్ కాల్స్‌కు నో బంద్
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా మే 3వరకు లాక్‌డౌన్ పొడిగించిన వేళ జియో ప్రీపెయిడ్ చందాదారులు ఇన్‌కమింగ్ కాల్స్ స్వీకరిస్తూనే ఉండేలా ఊరటనిచ్చింది. రీచార్జ్ ప్లాన్ల గడువు ముగిసినప్పటికీ ఇన్‌కమింగ్ కాల్స్ విషయంలో జియో కస్టమర్లందరికీ ఎలాంటి అంతరాయం వుండదని ప్రకటించింది.
తమ వినియోగ దారులదరికీ ఈ అవకాశం అందుబాటులో వుంటుందని జియో తెలిపింది. అయితే ఎప్పటివరకు ఈ చెల్లుబాటు అమల్లో వుంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన చందాదారులందరికీ మే 5 వరకు ఇన్ కమింగ్ కాల్స్ చెల్లుబాటును పొడిగించిన తరువాత జియో కూడా తన వినియోగదారులకు ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ కూడా మే 3వ తేదీ వరకు అన్ని ప్రీపెయిడ్ ఖాతాదారులకు ఇన్‌కమింగ్ కాల్స్ సేవల్లోఅంతరాయం వుండదని ప్రకటించింన సంగతి తెలిసిందే.