1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance Jio Broadband free service -introduces Work From Home pack for Rs 251

కొత్త కస్టమర్లకు ఉచితంగా జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు

Reliance Jio
దేశీయ టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వారికి ఉచితంగా సేవలు అందించనున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 
 
నిజానికి జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్‌ కొత్తగా ఒక కనెక్షన్‌ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్‌ కింద చెల్లిస్తారు. మినిమమ్‌ రీఫండబుల్‌ డిపాజిట్‌ తీసుకుని హోం గేట్‌వే రూటర్‌ను అందిస్తున్నారు. అలాగే, కంపనీ డాటా ఆడ్‌ ఆన్‌ ఓచర్లపై డబుల్‌ డాటాను అందిస్తుంది. నాన్‌ జియో వాయిస్‌ కాల్స్‌పై కూడా నిమిషాలను పెంచింది. 
 
కాగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కోసం కొత్త కనెక్షన్లకు ఫ్రీ బ్రాడ్‌ బాండ్‌ ప్లాన్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇపుడు ఈ దిశలోనే రిలయన్స్ జియో కూడా ముందుకు వచ్చింది. కరోనా వైరస్ భయం కారణంగా అన్ని కంపెనీలు తమతమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించిన విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మోడీ సర్కారు దొంగ దెబ్బ... లీటరు పెట్రోల్‌పై రూ.18 పెంపు