జియోను వరించిన ది హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు

శ్రీ| Last Updated: శనివారం, 8 ఫిబ్రవరి 2020 (19:39 IST)
హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ యొక్క ‘ది హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు’కు రిలయన్స్ జియో ఎంపిక అయింది. హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. జియో తెలంగాణ సిఇఒ శ్రీ కె.సి. రెడ్డి ఈ అవార్డును  అందుకున్నారు.
హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్ ఒక అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ. 
 
ఇది 130 దేశాలలో విస్తరించి ఉంది. సంస్థకు 2020 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఏడాదితో
హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్ 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా, తన భాగస్వామి సంస్థలను ‘ది హార్ట్‌ఫుల్ ఆర్గనైజేషన్ అవార్డు’తో సత్కరించింది.
 
ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్‌తో భాగస్వామ్యం కలిగిన ప్రపంచవ్యాప్తంగా 1,200 కి పైగా సంస్థల నుండి 10 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేసారు. 
Reliance Jio
Reliance Jio

 
నూతన సంవత్సరం  సందర్భంగా, రిలయన్స్ జియో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంతో  దేశ వ్యాప్తంగా 180 + జియో కార్యాలయాలలో 3 రోజుల వర్క్‌షాప్ నిర్వహించింది, వీటిలో 3000 మందికి పైగా జియో ఉద్యోగులు పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :