మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (17:25 IST)

ఆసియాలోనే అతిపెద్ద ఆటో ఎక్స్ పో.. జియో నుంచి కనెక్టెడ్ వెహికల్స్ ప్రదర్శన

ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ ఆటో ఎక్స్‌పో ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతుంది. 'ఎక్స్‌ప్లోర్ ద వాల్డ్ ఆఫ్ మొబిలిటీ' థీమ్‌తో ఈసారి ఆటో ఎక్స్‌పో 2020 ఈవెంట్‌ న్యూ ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతోంది. 2,35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇదే.
 
ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌‌లో రిలయన్స్ జియో కనెక్టెడ్ వెహికిల్ సొల్యూషన్‌ను ప్రదర్శించనుంది. యూజర్లు తమ వెహికల్ ఫెర్ఫమెన్స్‌తో పాటు ఇతర అంశాలను పరిశీలించేందుకు టెక్నాలజీని జియో నవీ ముంబై క్యాంపస్‌లో అభివృద్ధి చేస్తోంది.

ఇదిలా ఉంటే.. టెలికామ్ రంగంలో సంచలనం అయిన రిలయెన్స్ జియోకు హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ నుంచి 'ది హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు' లభించింది.