సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (10:57 IST)

పాత ప్లాన్‌ను పునరుద్ధరించిన జియో... 350 జీబీ డేటాతో...

దేశ టెలికాం రంగాన్ని శాసిస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. తాజా తన వినియోగదారుల కోసం ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ గత 2017లో అమలుపరిచి, ఆ తర్వాత రద్దు చేశారు. ఇపుడు ఇదే ప్లాన్‌ను తిరిగి పునరుద్ధరించారు. 
 
ఈ నూతన ప్లాన్ ఓ లాంగ్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ విలువ రూ.4999. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 350జీబీ డేటాను అందివ్వనుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, నాన్ జియో కాల్స్‌ కోసం 12 వేల నిమిషాలను ఉచితంగా అందివ్వనుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీని 360 రోజులుగా నిర్ణయించారు.